హత్రాస్‌ ఘటన తర్వాత మతపరమైన అల్లర్లకు కుట్ర

 

ఇస్లామిక్‌ దేశాల నుంచి వచ్చిన నిధులతో హత్రాస్‌ ఘటన తర్వాత మతపరమైన అల్లర్లకు కుట్ర జరిగిందంటూ బీజేపీ సర్కారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలు మరింత సంచలనంగా మారాయి. కేంద్రం కక్షసాధింపు చర్యలకు దిగుతోందంటూ భారత్‌లో తాజాగా కార్యకలాపాలు నిలిపేసిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్ధపై ఇస్లామిక్‌ దేశాల నుంచి నిధులు పొందుతోందంటూ కేంద్ర దర్యాప్తు సంస్ధలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. ఇదే వ్యవహారంలో ఆమ్నెస్టీ బ్యాంకు ఖాతాలను కూడా నిలిపివేశాయి. ఇప్పుడు హత్రాస్‌ వ్యవహారంలోనూ ఆమ్నెస్టీ సంస్ధ పాత్రపై యోగీ సర్కారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పలు ఆరోపణలు చేసింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్ధ ఇస్లామిక్‌ దేశాల నుంచి నిధులు తీసుకుంటూ దేశంలో మతపరమైన అల్లర్లకు కుట్ర చేస్తోందంటూ యోగీ సర్కారు తాజా అఫిడవిట్లో ఆరోపించింది. హత్రాస్‌ నిరసనలను అడ్డుపెట్టుకుని ఆమ్నెస్టీ ఈ కుట్రకు తెరలేపిందని యూపీ సర్కారు విమర్శలు చేస్తోంది.హత్రాస్‌లో దళిత యువతిపై అగ్రకులాలకు చెందిన కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా సాక్ష్యాలు మాయం చేసేందుకు పోలీసుల సాయంతో రాత్రికి రాత్రి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం పెల్లుబుకుతుండగా.. ఇప్పుడు యూపీలోని యోగీ సర్కారు ఈ నిరసనల వెనుక కుట్ర కోణం ఉందంటూ కొత్త వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *