ట్రంప్‌ పూర్తిగా కోలుకోలేదు

 

కోవిడ్‌ నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పూర్తిగా కోలుకోలేదనీ, ఇందుకు మరో వారం పడుతుందని ట్రంప్‌ వైద్యుడు డాక్టర్‌ సీన్‌ కాన్లే చెప్పారు. అప్పటి వరకు ఆయన వైట్‌హౌస్‌లోనే విశ్రాంతి తీసుకుంటారన్నారు. మిలిటరీ ఆస్పత్రిలో నాలుగు రోజుల చికిత్స సమయంలో ట్రంప్‌కు వైద్యులు నాలుగో డోసు రెమిడెసివిర్‌ ఇచ్చారు. ఇతరులకు ఈ వ్యాధి సోకకుండా ఉండాలంటే కోవిడ్‌ బారిన పడిన వ్యక్తులు కనీసం 10 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ నిపుణులు చెబుతుండటం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నాటకీయ ఫక్కీలో తిరిగి వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిన తర్వాత మిలిటరీ ఆస్పత్రిలో నాలుగు రోజులపాటు అసాధారణ రీతిలో వైద్య చికిత్సలు పొందిన ఆయన సోమవారం రాత్రి తిరిగి అధ్యక్ష భవనానికి వచ్చారు. కరోనాను చూసి భయపడటం లేదంటూ, మాస్క్‌ తీసేసిన ట్రంప్‌పై పలువురు మండిపడుతున్నారు. తనతోపాటు భార్య మెలానియా, శ్వేతసౌధంలోని పలువురు సిబ్బంది అనారోగ్యం బారిన పడినా కోవిడ్‌ పట్ల తన మొండివైఖరిని మార్చుకోకపోవడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *