వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం

 

శ్రీకాకుళం జిల్లా భామిని మండలం కొరమలో గుర్తు తెలియని వ్యక్తులు దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వసం చేశారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సెప్టెంబర్‌ 2న డీసీసీబీ చైర్మన్‌ పాలవలస విక్రాంత్‌ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దుండగులు విగ్రహాన్ని పెకిలించి వేసి దుండగులు కిందపడేశారు. పాలకొండ ఎమ్మెల్యే వి.కళావతి, డీసీసీబీ చైర్మన్‌ పాలవలస విక్రాంత్‌ ఈ ఘటనను ఖండించారు. విగ్రహం ఏర్పాటు విషయంలో గ్రామంలో ఎటు వంటి వివాదం లేదని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *