రుషికొండ భూములు జగన్‌ హస్తగతం

రుషికొండ భూములు జగన్‌ హస్తగతం

బినామీల పేర్లతో రూ.300 కోట్ల విలువైన రుషికొండ భూములు జగన్‌ హస్తగతం చేసుకున్నారని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకష్ణుడు ఆరోపించారు. హెటిరో ముసుగులో విశాఖ బేపార్క్‌ను జగన్‌ హస్తగతం చేసుకున్నారన్నారు. జగన్‌ క్విడ్‌ప్రోకో గుట్టురట్టు చేస్తామన్నారు. జగన్‌రెడ్డి బినామీ ట్రాన్సాక్షన్స్‌లో మరో లావాదేవీ విశాఖ బేపార్క్‌ అని యనమల పేర్కొన్నారు. జగన్‌ బినామీ వ్యవహారాలపై అత్యున్నత విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. కాకినాడ సెజ్‌, విశాఖ బేపార్క్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. రూ.120 కోట్లతో అభివద్ధి చేసిన బేపార్క్‌ చేతులు మారడం వెనుక హస్తం ఎవరిదని యనమల ప్రశ్నించారు. ఎవరి ఒత్తిళ్ల మేరకు విశాఖ బేపార్క్‌ మేజర్‌ వాటాలు హెటిరో పరం అయ్యాయని నిలదీశారు. టూరిజం ప్రాజెక్టులను టీడీపీ అభివద్ధి చేస్తే… జగన్‌ రెడ్డి బినామీ వ్యాపారాలను అభివద్ధి చేస్తున్నారన్నారు. 2004-09 మధ్య క్విడ్‌ ప్రోకో-1… ఇప్పుడు క్విడ్‌ ప్రోకో-2 అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *