భాజపాతో వైకాపాకు మైత్రి ఎలా సాధ్యం

 

అసలు భాజపాతో వైకాపాకు మైత్రి ఎలా సాధ్యపడుతుందని వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకష్ణరాజు ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ వైకాపాను ఎన్డీయేలో చేర్చుకోవాల్సిన అవసరం భాజపాకు లేదన్నారు. కేంద్ర మంత్రివర్గంలో వైకాపా చేరుతుందంటూ ఆ పార్టీయే కొన్ని పత్రికల్లో రాయించుకుందని ఆరోపించారు. ప్రత్యేకహోదా కోసం 21 మంది వైకాపా ఎంపీలు రాజీనామా చేస్తే తానూ సిద్ధమేనని ఆయన ప్రకటించారు. చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు వైకాపా సిద్ధపడితే సహకరిస్తా నన్నారు. రాజీనామా చేయాలని విప్‌ జారీచేస్తే అందరితో పాటు తాను ఉంటానని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *