బాలయ్యని కాపాడమని వైఎస్‌ దగ్గర ఏడ్చా

 

ఎన్టీఆర్‌ కుటుంబంలో ఓ వ్యక్తి కేసుల్లో ఉంటే ఎవరు కాపాడారు.. కుటుంబ గౌరవాన్ని చంద్రబాబు కాపాడారా.. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కాపాడారు.. అదే చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే అరెస్ట్‌ చేయించేవారన్నారు. ఆ రోజు తాను వైఎస్‌ దగ్గరకు వెళ్లి అన్నా అని ఏడ్చానని.. చాలా అమాయకుడు, లోకం తెలియని వ్యక్తి, పొరపాటు జరిగింది అన్నా కాపాడమని కోరాన న్నారు. ‘అమ్మా నువ్వు వెళ్లు అంతా మంచి జరుగుతుందని చెప్పారు. బాలయ్య విషయంలో జగన్‌ కూడా రికమండ్‌ చేశారు.. ఎందుకంటే బాలయ్యకు జగన్‌ అభిమాని కూడా’అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని ముసునూరు గ్రామంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ కుటుంబంలో బాలయ్య అంటే తనకు చాలా ప్రేమ అన్నారు లక్ష్మీపార్వతి. అందరి కంటే ఎక్కువ దగ్గరకు వచ్చింది.. అమ్మా అంటూ పిలిచింది బాలయ్య ఒక్కరు మాత్రమే అన్నారు. ఇప్పటికీ ఆయన అంటే ఎంతో ప్రేమని.. కానీ చంద్రబాబు బాలయ్య మనస్తత్వాన్ని విష పూరితం చేశారని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌ కూడా చంద్రబాబు నాయుడి దుర్మార్గమైన కుట్రల వల్లే మరణించారన్నారు లక్ష్మీపార్వతి. అధికార దాహంతో చంద్రబాబు కుట్రలో భాగస్వాములైన టీడీపీ నేతలందరూ ఎన్టీఆర్‌కు ద్రోహం చేసిన వారేనన్నారు. ఎన్నికల సమ యంలో చంద్రబాబు ఓట్ల కోసం ఎన్టీఆర్‌ పేరు వాడుకుంటారని.. తర్వాత ఏ సందర్భంలో కూడా ఎన్టీఆర్‌ ప్రస్తావన తీసుకురాని దుష్టుడని మండి పడ్డారు. తాను చంద్రబాబు నాయుడుపై 20 ఏళ్లుగా చేస్తున్న పోరాటానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా ఫలితం దక్కిందని చెప్పారు. అందరి సంక్షేమాన్ని కోరుకుంటూ పలు పథకాలు అమలు చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ మరో 30 ఏళ్లు సీఎంగా కొనసాగుతారని ఆకాంక్షించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *