శాశ్వతంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ఇప్పటికే పలు ఐటీ దిగ్గజాలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని శాశ్వతం చేసిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్‌ సైతం తన ఉద్యోగుల్లో సగం మంది రాబోయే ఐదు నుంచి పదేళ్ల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు ప్రకటించింది. ట్విటర్‌, స్క్వేర్‌ తాజాగా మైక్రోసాఫ్ట్‌ కూడా అదే విధానాన్ని అనుసరించనున్నాయి. అమెరికాలో వచ్చే ఏడాది జనవరికి ముందు మైక్రోస్టాఫ్‌ తన కార్యాలయాన్ని తెరిచే అవకాశం లేదు. తాజాగా, ఈ విషయంలో సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌-19 నేపథ్యంలో ఉద్యోగుల విధులకు సంబంధించి శుక్రవారం కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొంతమంది ఇకపై శాశ్వతంగా ఈ విధానాన్ని కొనసాగించే ప్రత్యామ్నా యాన్ని ముందుంచింది. అయితే, అన్ని రకాల ఉద్యోగులకు ఇది వర్తించదని షరతు విధించింది. హార్డ్‌వేర్‌ ల్యాబ్స్‌, డేటా సెంటర్లు, శిక్షణలో పాల్గొనే ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసుకు రావాల్సిందేనని వెల్లడించింది. అయితే, వీరికి సగం లేదా అంతకంటే తక్కువ పనిదినాల్లో మాత్రమే వర్క్‌ ఫ్రమ్‌ హోం అవకాశం కల్పించింది. దీనిపై ఆయా విభాగాల మేనేజర్లతో ఉద్యోగు లు చర్చించి నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *