గిరిజనుడికి షాకిచ్చిన కరెంట్‌ బిల్లు

 

విశాఖ జిల్లా పాడేరు శివారులో నివాసముంటున్న గిరిజనుడికి కరెంట్‌ బిల్లు చూస్తే షాకిచ్చింది. గెమ్మెలి కష్ణారావు అనే గిరిజనుడి ఇంటికి రూ. లక్షకు పైగా విద్యుత్తు బిల్లు వచ్చింది. దీంతో బాధితుడు షాకయ్యాడు. గతంలో కూడా తన ఇంటికి ఏకంగా రూ.1,39,848 బిల్లు వచ్చిందంటూ విద్యుత్తు శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అప్పటి నుంచి మీటరు రద్దు చేశారన్నారు. ఆ తర్వాత తనకు తరచూ రూ.500 వరకు బిల్లు వస్తుండేద న్నారు కష్ణారావు. ఈ నెలలో మరోసారి రూ.1,40,248 బిల్లు వచ్చిందని తన బాధను చెప్పుకున్నారు. తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండు నోటీసు సైతం జారీ చేశారని.. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని.. తప్పు ఎక్కడ జరిగిందో తెలుకుని చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవోకు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ బిల్లును పరిశీలించి తగిన చర్యలు తీసుకుం టామని అధికారులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *