జగన్‌ కంటే దుర్మార్గంగా చంద్రబాబు పాలన..

 

రాబోయే ప్రభుత్వంలో చంద్రబాబు మళ్లీ ఏపీ సీఎం అవుతారని అప్పుడు జగన్‌ కంటే దుర్మార్గంగా చంద్రబాబు పాలన సాగించాలని టీడీసీ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తెలిపారు. ఓ ప్రముఖ తెలుగు మీడియా ఛానల్‌తో జేసీ దివాకర్‌ రెడ్డి తాజాగా మాట్లాడారు. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారు.. వైఎస్‌ జగన్‌ కంటే రెండింతలు చంద్రబాబు ఎక్కువ దుర్మార్గపు పాలన చేయాలని అన్నారు. చంద్రబాబు మద్దతుదారుల మంతా కలిసి ఆయన గొంతు మీద కత్తి పెట్టి చేస్తావా? చెయ్యవా? చెయ్యకపోతే ఎలా అని ప్రశ్నిస్తామని అన్నారు. వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాలన దుర్మార్గంగా సాగుతోందని.. అంతకన్నా దుర్మార్గంగా చంద్రబాబు పాలన సాగాలని అన్నారు. తమపై వైసీపీ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. అందుకు ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. చంద్రబాబు సాత్వికుడంటూ.. అయితే, చంద్రబాబు నాయుడు సాత్వికుడు, దుర్మార్గపు ఆలోచనలు లేనివారని అన్నారు జేసీ దివాకర్‌ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అన్యాయం జరిగింది.. పార్టీ అండ ఉంటుందని చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలను జేసీ గుర్తు చేసుకున్నారు. అండ లేదు.. బండలే మా నెత్తిన రాళ్లు పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *