డిసెంబర్‌లో లవ్‌స్టోరీ

 

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి నటిస్తోంది జంటగా నటిస్తున్న చిత్రం లవ్‌స్టోరీ. ఏసియన్‌ సోనాలి నారంగ్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌ పై నారాయణదాస్‌ కె నారంగ్‌ – పుష్కర్‌ రామ్మోహన్‌ రావ్‌ కలిసి నిర్మిస్తున్నారు.శేఖర్‌ కమ్ముల ఈ సినిమాకి దర్శకుడు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. కాగా ఇప్పటికే దాదాపుగా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ‘లవ్‌ స్టోరీ’.. మిగతా చిత్రీకరణ ఈ షెడ్యూల్‌లో పూర్తి చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ మధ్య కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్‌ చేస్తుండటంతో నాగచైతన్య మూవీ కూడా డిజిటల్‌ రిలీజ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. అందుకోసం ఇప్పటికే ప్రముఖ ఓటీటీలు ఫ్యాన్సీ ఆఫర్స్‌ ఇస్తున్నాయని తెలుస్తోంది. చైతన్య మాత్రం ఓటీటీ రిలీజ్‌ కి ససేమిరా అంటూ థియేటర్స్‌ రీ ఓపెన్‌ చేస్తున్నారు కాబట్టి థియేట్రికల్‌ రిలీజ్‌ కి వెళ్లాలని సూచిస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్‌ లో టాక్‌ వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *