వరదనీటిలో కేజీన్నర బంగారం కొట్టుకుపోయింది…

 

వరదనీటిలో కేజీన్నర బంగారం కొట్టుకుపోయింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఒక కస్టమర్‌ కోసం బషీర్‌ బాగ్‌లో ఉన్న ‘విఎస్‌ గోల్డ్‌ జువెలర్స్‌’ నుండి జూబ్లీహిల్స్‌లోని ‘కష్ణా పెరల్స్‌’ షాపుకు నగలు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రదీప్‌ అనే సేల్స్‌ మెన్‌ బంగారాన్ని టూ వీలర్‌ పై తరలిస్తున్న క్రమంలో నగల సంచి భారీ వర్షంతో కూడిన వరద నీటిలో కొట్టుకుపోయినట్టు ప్రదీప్‌ చెబుతున్నాడు. దీంతో, నగలకోసం షాపు సిబ్బంది రాత్రంతా గాలించగా సంచిమాత్రం దొరికిందని షాపు యజమాని తెలిపారు. సంచిలో నగలు మాయం కావడంతో బంజారాహిల్స్‌ పోలీసులకు షాపు ఓనర్‌ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సేల్స్‌ మెన్‌ ప్రదీప్‌ను అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రదీప్‌ సంచరించిన పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాల దశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సేల్స్‌మేన్‌ నగలు దాచేసి అబద్ధాలు చెబుతున్నాడా లేక నిజంగా నగలు కొట్టుకుపోయాయా ? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *