రజనీకాంత్‌కు హైకోర్టు వార్నింగ్‌

 

ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై మద్రాస్‌ హైకోర్టు హెచ్చరించింది. చెన్నైలోని కొడం బాకంలో రాఘవేంద్ర కళ్యాణమంటపం పేరిట రజనీకాంత్‌కు ఒక కళ్యాణ మండపం ఉంది. అయితే దానికి సంబంధించి రూ. 6.5 లక్షల ఆస్తి పన్ను చెల్లించాలంటూ ఆయనకు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ నోటీసులు పంపించింది. ఈ నోటీసులపై మద్రాస్‌ హైకోర్టును రజనీకాంత్‌ ఆశ్రయించారు. కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ విధించిన నేపథ్యంలో మార్చి 24 నుంచి కళ్యాణమండపం మూసి ఉందని… అప్పటి నుంచి కళ్యాణ మండపం ద్వారా తమకు ఎలాంటి ఆదాయం రాలేదని ఆయన కోర్టులో పేర్కొన్నారు. అందువల్ల తాను ఆ పన్నును చెల్లించలేనని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ అనిత సుమంత్‌ రజనీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుం దని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *