రాష్ట్రంలో రైతుల కన్నీటి వరద

 

రాష్ట్రంలో రైతుల కన్నీటి వరద ప్రవహిస్తోంది అంటూ వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి ఢిల్లీ చుట్టూ తిరిగి జడ్జీలపై కంప్లైంట్‌లు పెట్టడం తప్ప రాష్ట్రం పట్టదా అంటూ నారా లోకేష్‌ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించారు. వరదలు, బురదలు అంత అసహ్యం కలిగిస్తున్నాయా ? ఒక్కరోజన్నా కాలు బయటపెట్టి బాధితుల గోడు విన్నారా అంటూ సీఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు లోకేష్‌. వరదలు బురదలు అంత అసహ్యం కలిగిస్తున్నాయా అంటూ ప్రశ్నించారు. రిజర్వు బ్యాంకు ఖజానా ఖాళీ అయ్యేంతగా అప్పులు దూసి తెస్తున్న వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఇంత వరకు రైతులకు రూపాయి కూడా సాయం చేసింది లేదు అంటూ ఆయన పేర్కొన్నారు. ప్రచారం మాత్రం ఓ రేంజ్‌లో చేసుకుంటున్నారంటూ లోకేష్‌ మండిపడ్డారు. ఏపీలోని ప్రభుత్వం తీసుకు వస్తున్న వేల కోట్ల అప్పులు ఎటు పోతున్నాయో రైతులకు తెలియడం లేదంటూ మండిపడ్డారు లోకేష్‌. వర్షాలు వరదల కారణంగా రాష్ట్రం అల్లకల్లోలం అవుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని, రైతుల గురించి పట్టించుకునే ఆలోచన లేదని ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *