మళ్లీ ఐశ్వర్య అక్కడికి వెళ్తుంది

22 ఏళ్ల క్రితం ఐశ్వర్యారాయ్‌, ప్రశాంత్‌ కలిసి ‘జీన్స్‌’ అనే చిత్రంలో నటించారు. 22 ఏళ్ల క్రితం వచ్చిన ఈ హిట్‌ చిత్రాన్ని శంకర్‌ డైరెక్ట్‌ చేశారు. తర్వాత తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించిన ఐశ్వర్య ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమయ్యారు. కాగా చాలా కాలం తర్వాత ఆమె తమిళంలో నటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. హిందీ సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘అంధధూన్‌’ను తెలుగుతో పాటు తమిళంలో కూడా రీమేక్‌ కానుంది. తెలుగులో నితిన్‌ లీడ్‌ రోల్‌ చేస్తుంటే తమిళంలో ప్రశాంత్‌ కథానాయకుడిగా నటించనున్నారు. అలాగే కథలో ప్రధానమైన నెగెటివ్‌ రోల్‌ కోసం బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ను తీసుకునే ప్రయత్నంలో ఉన్నారట నిర్మాత. ఒరిజినల్‌ వెర్షన్లో టబు ఈ పాత్ర చేయగా ఆమెకు చాలా మంచి పేరోచ్చింది. ఐశ్వర్య నటిస్తే సినిమా కు బోలెడంత గ్లామర్‌ అప్పీల్‌ వస్తుందని, హైప్‌ పెరుగుతుందని నిర్మాత ఆలోచన. అయితే ఇంకా ఐశ్వర్యరాయ్‌తో చర్చలు నడుస్తున్నాయని, ఆమె ఫైనల్‌ డెసిషన్‌ తీసుకోవాల్సి ఉందని తెలు స్తోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత తియగరాజన్‌ స్వయాన ప్రశాంత్‌ తండ్రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *