అప్పులు ఊబిలో భారత్‌

 

మనదేశం అప్పుల ఊబిలో కురుకుపోయింది. కరోనా కారణంగా దాయాలు క్షీణించడతో పన్ను రాబడి కూడా గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యం లో ఈ ఏడాది రుణభారం 17 శాతం పెరిగే అవకాశం ఉన్నదని అది జీడీపీ లో 90 శాతానికి చేరే అవకాశం ఉన్నదని ఐఎంఎఫ్‌ ఆర్థిక వ్యవహారాల శాఖ డైరెక్టర్‌ విటార్‌ గాస్పర్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది భారత ప్రభుత్వ రుణభారం 17 శాతం పెరిగి జీడీపీలో 90 శాతానికి చేరవచ్చునని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. 1991 నుంచి మనదేశ రుణభారం జీడీపీలో 70 శాతం వద్ద స్థిరంగా కొనసాగుతున్నది. కొవిడ్‌-19 కారణంగా ఆర్థిక వ్యవస్థ భారీగా పతనమైంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం వ్యయాలను పెంచింది. దీంతోపాటు ఆ2021 వరకు ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగినప్పటికీ.. 2025 నాటికి క్రమంగా తగ్గే అవకాశం ఉన్నదని ఆయన అభిప్రాయ పడ్డారు. కరోనాకు స్పందనగా ప్రభుత్వ వ్యయాలను పెంచడం భారతదేశం ఒక్క దానికే పరిమితం కాదని ఆయన అన్నారు. 1991లో ఆర్థిక సరళీకరణ జరిగిన నాటి నుంచి ప్రపంచ వద్ధిలో భారత్‌ కీలక భాగస్వామిగా ఉన్నదని ఆయన చెప్పారు. 1991 నుంచి 2019 మధ్య కాలంలో వాస్తవ జీడీపీ వద్ధి 6.5 శాతం ఉండడం ప్రోత్సాహకరమైన అంశమని దీని కారణంగా లక్షల మంది పేదరికం నుంచి బయటపడ్డారని గాస్పర్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *