ఒకే సినిమాలో చిరు, మహేష్‌, చరణ్‌

అవును ఒకే సినిమాలో మెగాస్టార్‌, సూపర్‌స్టార్‌, పవర్‌స్టార్‌ల కలయిక అభిమానులకు కన్నుల పండగే. కాకపోతే ఆ సినిమాలో సూపర్‌స్టార్‌ వాయిస్‌ మాత్రమే వినబడబోతుందట. విషయానికి వస్తే మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా, రామకునచరణ్‌ ప్రత్యేకపాత్రలో ఆచార్య సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో సూపర్‌స్టార్‌ మహేకుష్‌బాబు తన గొంతు ద్వారా వాయిస్‌ ఓవర్‌ వినిపించబోతున్నాడట. ఈ సినిమా దర్శకుడు కొరటాల శివతోనూ, ఇటు మెగాస్టార్‌ చిరంజీవితోనూ ఉన్న అనుబంధం వల్ల మహేష్‌ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంతకు ముందు మహేష్‌బాబు పవన్‌కల్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్లో వచ్చిన జల్సా, శ్రీను వైట్ల దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించిన బద్షా సినిమాలకు కూడా తన గొంతు అరువిచ్చాడు. కాగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌తో కలిసి రామ్‌చరణ్‌ ఈ సినిమా నిర్మిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *