టీటీడీ చైర్మన్‌కు కరోనా

 

ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రజా ప్రతినిధి కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులకు కరోనా సోకింది. వారిలో చాలామంది కోలుకోగా ఒక ఎంపీ మృతి చెందారు. తాజాగా టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన టీటీడీ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 12న తన ఇంట్లో జరిగిన వేడుకలకు వెళ్లారు. వైవీ సుబ్బారెడ్డికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆయన్ను ఇటీవల కలిసిన వారిలో ఆందోళన మొదలైంది. ఇదిలా ఉంటే ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ని కూడా కరోనా వెంటాడుతోంది. గత నెలలో బ్రహ్మూెత్సవాల కోసం తిరుమల వెళ్లి వచ్చిన తర్వాత గత నెల 28న ఆయనకు పాజిటివ్‌ తేలింది. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతుండగా.. బుధవారం ఆయన ఆరోగ్యం కాస్త ఇబ్బంది మారింది. దీంతో హుటా హుటిన ఆయన్ను హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆయన్ను ప్రైవేట్‌ ఫ్లైట్‌లో హైదరాబాద్‌ తరలించినట్లు సమాచారం. కాగా ఇటీవల వైసీపీ విశాఖపట్నం నగరానికి చెందిన ద్రోణంరాజు శ్రీనివాస్‌ కరోనా బారినపడి కోలుకున్న ఇతర అనారోగ్యాలతో మృతి చెందిన సంగతి తెలిసిందే,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *