పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

 

తమది రైతు పక్షపాత ప్రభుత్వమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేస్తామన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 5700 హెక్టర్ల పంటకు నష్టం వాటిల్లింది అన్నారు. ప్రధానంగా వరి, చెరకు పంటలకు నష్టం అధికంగా ఉందన్నారు. చోడవరం, ఎస్‌ రాయవరం, రావికమతం, రాంబిల్లి మండలాల్లో నష్టం తీవ్రత తెలిపారు. విశాఖ నగరంలోని మూలగాడ మండలం గణపతి కాలనీ లో గోడ కూలడంతో మతి చెందిన తల్లి, బిడ్డలకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయలు చొప్పున.. 8 లక్షల రూపాయలను వారి సమీప అందజేశామని తెలిపారు. కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ మాట్లాడుతూ నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశామని.. మరో రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. భారీ వర్షాల కారణంగా.. జీవీఎంసీ, ఆర్‌ అండ్‌ బి, ఈపీడీసీఎల్‌ సంస్థలకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన అత్యవసర పనులను తక్షణమే పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. భారీ వర్షాల కారణంగా మతిచెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. ఈ సమావేశానికి ముందు మంత్రి మొత్తం శెట్టి శ్రీనివాసరావు… జిల్లా అధికారులతో వర్షం వాటిల్లిన నష్టం పై సమీక్ష నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *