జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరడం ఖాయం

 

విశాఖ జీవీఎంసీ ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయనే అంశంపై విడిపి అసోసియేట్స్ ఆర్ అండ్ డి సంస్థ ఓపీనియన్‌ పోల్‌ నిర్వహించినట్లు  తెలిపింది. ఒకవేళ ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే వైఎస్సార్‌సీపీ సత్తా చాటడం ఖాయమంటోంది.. టీడీపీకి నామ మాత్రపు సీట్లు మాత్రమే వస్తాయని.. జనసేన కంటే ఇతరులు, ఇండిపెండెట్లకు ఎక్కువ సీట్లు వస్తాయని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీకి 49.8%.. టీడీపీకి 36.5%.. ఇతరులు, ఇండిపెండెట్లకు 5.1%.. జనసేనకు 4.1%.. బీజేపీకి 2.8%.. కాంగ్రెస్‌ పార్టీకి 1.7% ఓట్లు వస్తాయంటోంది. కార్పొరేషన్‌ స్థానాల విషయానికి వస్తే.. మొత్తం 98 సీట్లలో వైఎస్సార్‌సీపీకి 84-89 వరకు వస్తాయని.. టీడీపీకి 8-14 మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *