వేల కోట్ల అవినీతి చేసి ఇప్పుడు మాపై ఆరోపణలు

 

చంద్రబాబు నాయుడు వేల కోట్ల అవినీతి చేసి ఇప్పుడు మా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి. నితీశ్వరీ కేసులో దోషులను కాపాడి పంచాయతీ చేసిన ఘనత చంద్ర బాబుదని’ శ్రీకాంత్‌ రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రంలోకి సీబీఐను అనుమతించను అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రతి ఘటనకు సీబీఐ విచారణకు ఎందుకని డిమాండ్‌ చేస్తున్నారు. తప్పు చేయకుంటే విచారణకు రావడానికి భయమెందుకు ? సీఎం వైఎస్‌ జగన్‌ సుప్రీం కోర్ట్‌ సీజే కి లేఖ రాసినప్పటి నుంచి ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్ళారు. మరీ ఆయన అజ్ఞాతంలో ఉంటూ ఏ కుట్రలకు తెర లేపుతున్నారో అన్న అనుమానం ఉందన్నారు. అమరావతిని ముంచాలనే ప్రయత్నం చేశారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం శత్రువులకు కూడా అన్యాయం చేయదు. లోకేష్‌ పొలాల్లోకి దిగి ఫొటోలో దిగారు.. కనీసం వరి నాట్లు ఎలా ఉంటాయో కూడా తెలియని ఆయన ఫోటోల కోసమే ఫోజులు ఇవ్వ డం చేశారు. చంద్రబాబు హయాంలో కరువు వస్తే కనీసం ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఇవ్వలేదు.కానీ అప్పటి బకాయిలను కూడా మా ప్రభుత్వం ఇచ్చిందని తెలపారు శ్రీకాంత్‌ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *