జగన్‌కు విజయవాడ, అమరావతి అంటే ఇష్టం లేదు

 

జగన్‌కు విజయవాడ, అమరావతి అంటే ఇష్టం లేదు” అని టీడీపీ ఎం కేశినేని నాని ఆరోపించారు. శుక్రవారం కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కనకదుర్గ ఫ్లైఓవర్‌ సాధ్యం కాదని అప్పటి ప్రతిపక్షాలు విమర్శించాయని, కానీ అసాధ్యాన్ని తెదేపా సుసాధ్యం చేసిందన్నారు. వంతెన దేశంలోనే ఒక అద్భుత మైన కట్టడమని పేర్కొన్నారు. . తెదేపా తీసుకొచ్చిన ప్రాజెక్టులకు ఇప్పటి ప్రభుత్వం శంకుస్థాపనలు చేసింది తప్ప.. తట్ట ఇసుక, బస్తా సిమెంట్‌తో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టలేదన్నారు. బస్టాండ్‌ కన్నా హీనంగా ఉన్న విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి తెదేపా ప్రభుత్వం తీసుకొచ్చిందని నాని గుర్తు చేశారు. .కనకదుర్గ ఫ్లై ఓవర్‌ కోసం తెదేపా అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. ఈ తెదేపా ప్రభుత్వం హయాంలో నితిన్‌ గడ్కరీ సహకారంతో ప్రాజెక్టును కీలకదశకు తీసుకువచ్చామని, విజయవాడ అం దాన్ని మరింత పెంచేలా ఫ్లై ఓవర్‌ ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *