బాలకృష్ణ సరసన ప్రగ్యా

 

నందమూరి బాలకష్ణ, బోయపాటి శ్రీనుల కలయికలో చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇన్నాళ్లు ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌ సెట్‌ అవలేదు. బోయపాటి శ్రీను ఎందరో హీరోయిన్ల పేర్లు పరిశీలించినా ఎవ్వరూ కుదరలేదు. బాలయ్య పక్కన ఫ్రెష్‌ ఫేస్‌ అయితే బాగుంటుందని భావించిన బోయపాటి ఎంతో వెతుకులాట తర్వాత మలయాళ నటి ప్రగ్యా మార్టిన్‌ పేరును కన్ఫర్మ్‌ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ప్రగ్యా మార్టిన్‌ మలయాళంలోనే కాకుండా తమిళంలో కూడ నటించింది. తమిళంలో ఆమె మొదటి చిత్రం మిస్కిన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పిశాసు’. ఈ సినిమాలో టాలీవుడ్‌లో పాతుకు పోవాలని అమ్మడి భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *