మంచు కుటుంబానికి వెంకీ మాట సాయం

 

మంచు విష్ణు కథానాయకునిగా, కాజల్‌ కథానాయికగా తెరకెక్కిస్తున్న భారీ పాన్‌ ఇండియన్‌ చిత్రం ”మోసగాళ్లు”. జెఫ్రీ గీ చిన్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి మన టాలీవుడ్‌ హీరో విక్టరీ వెంకటేష్‌ తన వాయిస్‌ ఓవర్‌ను ఇస్తున్నారని చిత్ర యూనిట్‌ కన్ఫర్మ్‌ చేసేసారు. ఈ చిత్రానికి మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో ప్లాన్‌ చేస్తుండగా సామ్‌ సి ఎస్‌ సంగీతం అందిస్తున్నారు. అలాగే నవదీప్‌, నవీన్‌ చంద్ర, అలాగే రుషి శర్మ తదితరులు నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం వెంకటేష్‌ నారప్పలో నటిస్తున్నారు. సురేష్‌ బ్యానర్‌పై డి. సురేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి వెంకీ సరసన నటిస్తోంది. దీంతో పాటు అనిల్‌ రావిపూడి డైరెక్షన్లో ఎఫ్‌ -3లో నటించేందుకు కూడా వెంకటేష్‌ సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కూడా ఎకుఫ్‌ – 2లో నటించిన వరుణ్‌తేజ్‌తో పాటు తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలు స్తోంది. కాగా ఈ సినిమాలో కీలకపాత్రలో హాస్యనటుడు సునీల్‌ నటిస్తాడని అంటున్నారు. వచ్చే ఏడాది ప్రారంభ మయ్యే ఈ సినిమా 2022 సంక్రాంతికి రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పాటు ఇటీవలే మేనల్లుడు నాగచైతన్యతో వెంకీమామా చిత్రంలో నటించిన వెంకటేష్‌ మరో చిత్రం నాగచచైతన్యతో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. తమిళ డైరెక్టర్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *