పథకాల పేరుతో ప్రజలకు ప్రలోభం

 

అప్పు చేసి పప్పు కూడు తిన్నట్టు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ప్రజలకు పథకాల పేరుతో డబ్బులు వేస్తూ ప్రజలను ప్రలోభ పెడుతున్నారని సినీ నటి, టీడీపీ నాయకురాలు దివ్యవాణి ఆరోపించారు. సీఎం జగన్‌ బాధ్యతగా వ్యవహరించడం లేదనీ, ఇక మంత్రుల తీరు సరే సరి అంటూ దివ్యవాణి కొడాలి నానిపై మండిపడ్డారు. నారా లోకేష్‌ను అనేంత స్థాయి కొడాలి నానికి లేదని స్పష్టం చేశారు.కొడాలి నాని తన పద్ధతి మార్చుకోవాలని దివ్యవాణి వార్నింగ్‌ ఇచ్చారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం రాజకీయం కాదు అని మండిపడ్డారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధికార ప్రతినిధి దివ్య వాణి భగ్గుమంటు న్నారు. చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నాయకుడా, లేక నారా లోకేష్‌ ప్రతిపక్ష నాయకుడా ? వరద ప్రభావిత ప్రాంతాల్లో లోకేష్‌ పర్యటించడం దేనికీ అంటూ సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో లోకేష్‌ పర్యటన పై విమర్శలు గుప్పించిన కొడాలి నానిపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. తాగుబోతు మంత్రి, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్‌ అవుతున్నారు. తాజాగా టీడీపీ నాయకురాలు దివ్యవాణి కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పై ఆయన చేస్తున్న విమర్శలను దివ్యవాణి ఖండించారు. లోకేష్‌ను విమర్శించటానికి ఆవగింజలో 60వ వంతైనా అర్హత లేదు కొడాలి నాని దుమ్ము దులిపారు దివ్య వాణి. నారా లోకేష్‌ను విమర్శించే వారికి ఆవగింజలో 60వ వంతు అయినా అర్హత ఉందా అంటూ దివ్యవాణి మండిపడ్డారు. ఎంబీఏ చదివి ప్రపంచ బ్యాంకు లో పనిచేసిన రికార్డు నారా లోకేష్‌ కు ఉందని కొడాలి నానికి చదువు సంధ్య లేదని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు వంటి విజన్‌ ఉన్న నాయకుడి తనయుడుగా లోకేష్‌కు కష్టపడే స్వభావం ఉందని అయినప్పటికీ మీలాంటి ఇంగితజ్ఞానం, సంస్కారం లేని వాళ్లతో మాటలు పడుతున్నారు అంటూ దివ్యవాణి నిప్పులు చెరిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *