‘ఆర్‌ఆర్‌్‌ఆర్‌’ టీజర్‌ రిలీజ్‌ … వాడి పొగరు ఎగిరే జెండా

ఎన్టీయార్‌ అభిమానుల గురువారం గొప్ప కన్నుల పండుగ చేశారు దర్శకధీరుడు రాజమౌళి. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో ఎన్టీఆర్‌ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా చేస్తున్న ఎన్టీయార్‌ పాత్ర తీరుతెన్నులను పరిచయం చేస్తూ ఈ వీడియోను రూపొందించారు. ”వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ. నా తమ్ముడు గోండ్రు బెబ్బులి.. కొమురం భీమ్‌” అంటూ రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌తో ఎన్టీయార్‌ పాత్రను పరిచయం చేశారు. ఎన్టీయార్‌ పోరాట వీరుడిగా అద్భతంగా కనిపించాడు. బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంది. కాగా ఇంతకు ముందు విడుదల చేసిన రామ్‌చరణ్‌ టీజర్‌తో పోలిస్తే అంత గొప్పగా ఈ టీజర్‌ లేదనిపిస్తుందని ఒక వర్గం ప్రేక్షకులం టున్నారు. చూడాలి ఈ టీజర్‌ చూడగాచూడగా ఆకట్టుకుంటుందేమో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *