వాణీ ఆ పాత్రలో నటిస్తుందట

 

విలక్షణ చిత్రాల హీరో ఆయుష్మాన్‌ ఖురానా చండీగర్‌ కరే ఆషికి అనే పేరుతో రూపొందుతున్నచిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో క్రేజీ యంగ్‌ హీరో ఆయుష్మాన్‌కు జోడీగా వాణీకపూర్‌ కనిపించబోతోంది. అయితే వాణీకపూర్‌ ఈ మూవీలో రెగ్యులర్‌ హీరోయిన్గా కనిపించడం లేదు. ఓ ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతోంది. ట్రాన్స్‌ జెండర్‌గా వాణీ పాత్ర సరికొత్తగా వుంటుందని తెలుస్తోంది. సవాలుతో కూడుకున్న పాత్ర కావడం వల్లే వాణీ ఈ పాత్రని అంగీకరించిందని చెబుతున్నారు. లింగ మార్పిడి చేయించుకున్న ట్రాన్స్‌ జెండర్‌గా వాణీ పాత్ర సరికొత్తగా వుంటుందని తెలిసింది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. ఆహా కళ్యాణం మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది వాణీ కపూర్‌. అయితే తెలుగులో నటించిన తొలి చిత్రమే ఫ్లాప్‌ కావడంతో మళ్లీ ఇక్కడ కనిపించలేదు. బాలీవుడ్‌లో తన అదష్టాన్ని పరీక్షించుకుం టోంది. బేఫికర్‌.. వార్‌ చిత్రాల్లో నటించింది. ఆ రెండూ తనకు చక్కని గుర్తింపును తెచ్చాయి. ప్రస్తుతం బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌తో కలిసి బెల్‌ బాటమ్‌తో పాటు మరో చిత్రంలో నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *