పవన్‌ సినిమాలో రానా

 

మలయాళ హిట్‌ మూవీ అయ్యప్పన్‌ కోషియమ్‌ను తెలుగులో రీమేక్‌ రైట్స్‌ను సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ వారు తీసుకున్నారు. అప్పటి నుండి పలువురు హీరోలతో సితార వారు చర్చలు జరుపుతూ వచ్చారు. త్రివిక్రమ్‌ మరియు కొందరు రచయితలు స్క్రిప్ట్‌కు పదును పెట్టడంతో పాటు పవన్‌ను ఒప్పించే ప్రయ త్నం చేసి సఫలం అయ్యారనే వార్తలు వస్తున్నాయి. పవన్‌తో పాటు నటించేందుకు రానా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సాగర్‌ దర్శకత్వం వహించబోతున్నట్లుగా కూడా మీడియా సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. కేవలం నెల రోజుల్లోనే ఈ సినిమాను పూర్తి చేసేలా ప్లాన్‌ చేస్తున్నారట. పవన్‌ మరియు రానాలు అధికారికంగా ఓకే చెప్తే దసరాకు ఈ రీమేక్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పవన్‌ ఇప్పటికే చాలా సినిమాలు కమిట్‌ అయ్యి ఉన్నాడు. సురేందర్‌రెడ్డి, హరీష్‌శంకర్‌, క్రిష్‌ డైరెక్షన్లో సినిమాలు చేయబోతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *