అమరావతి అందరిది

 

అమరావతి ఏ ఒక్కరికో నోటిఫై చేసిన ప్రాంతం కాదని, ఇక్కడ అందరికీ హక్కు ఉంటుందని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిపై మాదే పెత్తనం అంటే ఒప్పుకునేది లేదని, పేదలు, దళితులకు ఇళ్ల స్థలాలు పొందే హక్కు ఉందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వరద బాధితులను ఆదకునేందుకు అనునిత్యం చర్యలు తీసుకుంటున్నారని మంత్రి కన్నబాబు అన్నారు. లోకేష్‌, చంద్రబాబు చెబితే పాలన జరగడం లేదని, తండ్రీ కొడుకులు హైదరాబాద్‌లో కాపురం పెట్టి ఏపీపై పెత్తనం చేస్తున్నారని దుయ్యబట్టారు. లోకేష్‌ చెప్తే వాళ్ళ కార్యకర్తలే వినరని, తమ బాధ్యత ఏంటో తమకు తెలుసునని ఎద్దేవా చేశారు. బహుశా లోకేష్‌ కొత్తగా వరద ప్రాంతాల్లో పర్యటించినట్లున్నాడని మంత్రి కన్నబాబు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *