చీరల కొట్లో పని చేసారా విష్ణురెడ్డి గారు?

”పూర్వాశ్రమంలో చీరల కొట్లో పని చేసారా విష్ణురెడ్డి గారు? అని ట్వీట్ చేశారు టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. రాజధాని అమరావతి కోసం ఉద్యమం కోసం ఆందోళనల చేస్తున్న మహిళలపై ఏపీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రూ. 50 వేల చీర కట్టుకుని ఉద్యమాలు చేస్తుంది అంటూ ఓ మహిళను ఉద్దేశించి విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు అనిత. శుక్రవారం దీనిపై ట్వీట్ చేశారు ఆమె. అంత ఖచ్చితంగా చీరల రేట్లు చెప్తున్నారు. రైతు అంటే ఇలానే ఉండాలని రూల్ ఉందా? దేనికి రైతులంటే అంత చిన్నచూపు. జగన్ రెడ్డి గారి ప్రాపకం కోసం వేరే మార్గం వెతుక్కోండి. ఇలా చీరలు, చొక్కాలు అంటూ చిల్లర మాటలు దేనికండి?” అంటూ ఓ రేంజ్లో కౌంటర్ ఇచ్చారు.