చంద్రబాబు అసత్య ప్రచారాలు

 

టీడీపీ అధినేత చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. సీఎం జగన్‌ రైతు పక్షపాతి అని కొనియాడారు. విద్యుత్‌ మీటర్ల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. 30 ఏళ్లపాటు రైతులకు ఉచితంగా విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకుంటుంన్నామని వెల్లడించారు. 89శాతం మంది రైతులకు పగటి పూట 9 గంటల విద్యుత్‌ అందిస్తున్నా మని తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ మీటర్లు రానున్నాయి. మీటర్‌ రీడింగ్‌ ఆధారంగా ప్రభుత్వమే కరెంటు బిల్లులను విద్యుత్‌ సంస్థలకు చెల్లిస్తుంది. రైతు ప్రమేయం లేకుండానే ఈ ‘నగదు బదిలీ’ జరిగిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *