నటిగా మారుతున్న సానియా మీర్జా

ప్రముఖ అంతర్జాతీయ టెన్నిస్‌ క్రీడాకారిణి, హైదరాబాదీ సానియా మీర్జా నటిగా మారతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం, శరీర సౌష్టం గల సానియాకు లక్షల్లో అభిమానులున్నారు. ముఖ్యంగా ఆమె అందానికే ఫిదా అయ్యే కుర్రకారు లెక్కలేదు. ఒక పిల్లాడికి తల్లైన సానియాలో మెరుపులు ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు తన టెన్నిస్‌ కెరీర్‌ ఇంకెంత కాలం కొనసాగేలా కనిపించకపోవడంతో ఆమె నటనపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఆమె బాలీవుడ్‌లో చాలా పరిచయాలు కూడా ఉన్నాయి. కాగా ఆమె ప్రస్తుతం నిషేద్‌ ఎలోన్‌ టుగెదర్‌ సిరీస్‌లో కనిపించనుందట. మొత్తం ఐదు ఎపిసోడ్‌లుగా ఇది ప్రసారం కాబోతోందట. ఈ నెల చివరి నుంచి ఈ సిరీస్‌ అందుబాటులోకి రాబోతున్నట్టు సమాచారం. ఈ సిరీస్‌ ఎవమ్‌ టీవలో ప్రసారం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *