మైనర్ బాలికపై రేప్ .. స్టార్ అథ్లెట్ అరెస్ట్

కెన్యా స్టార్ అథ్లెట్.. రియో ఒలింపిక్స్ స్టీపుల్ ఛేజ్ పసిడి విజేత క్రిపుటో మైనర్ బాలికపై లైంగికదాడి చేఇన కేసులో అరెస్టయ్యాడు. గత నెలలో 15 ఏళ్ల మైనర్ బాలికతో సెక్స్ చేశారన్న కేసు అతనిపై నమోదైంది. దీంతో పాతికేళ్ల ప్రిపుటోను ఈ మధ్యనే అరెస్టు చేశారు. తాజా పరిణామాలతో అతను టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయినట్లేనని చెబుతున్నారు. ఒకవేళ.. నేరం రుజువైతే.. అతని జీవితం మొత్తంగా చిక్కుల్లో పడటం ఖాయమని చెప్పక తప్పదు. కెన్యా లైంగిక నేరాల చట్టం ప్రకారం.. మైనర్ బాలికతో సెక్సు చేయటం చాలా పెద్ద నేరం. పద్దెనిమిదేళ్ల లోపు వారితో సెక్సు చేస్తే తీవ్రమైన శిక్షలు తప్పవు. తాజాగా నేరారోపణలు ఎదుర్కొంటున్న అతను తప్పు చేసినట్లు తేలితే.. 20 ఏళ్లు జైలుశిక్షను విధించే వీలుంది. అతడు తప్పు చేశాడా? లేడా? అన్నది పక్కన పెడితే.. ఒక రంగంలో అత్యుత్తమ స్థానానికి చేరుకోవటానికి పడిన శ్రమను.. కొన్ని బలహీనతలతో జీవితాన్నే నాశనం చేసుకున్న వారిలో ఒకడయ్యాడు. ప్చ్ !