పవన్‌ సరసన ఫిదా భామ

 

నటి సాయిపల్లవి భారీ ఛాన్సును కొట్టేసినట్లు తెలుస్తోంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ క్రిష్‌తో చేయబోయే సినిమాలో అమ్మడికి అవకాశం వచ్చిందని అంటున్నారు. మొగలాయిల కాలం నాటి కథతో పీరియాడిక్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కు తున్న ఈ చిత్రంలో పవన్‌ బందిపోటుగా కనిపించనున్నట్లు టాక్‌. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్‌ ఉండటంతో మొదటి హీరోయిన్‌గా ‘సాహో’ భామ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె కన్ఫార్మ్‌ చేసింది. మరో హీరోయిన్‌గా సాయిపల్లవి పేరు కూడా వినిపిస్తోంది. జమీందారీ కుటుంబానికి చెందిన యువతి పాత్ర సినిమాకే హైలెట్‌ నిలుస్తుందని, అందువల్ల సాయిపల్లవి అయితే బాగుంటుందని యూనిట్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం తెలుగులో సాయి పల్లవి రానాతో విరాటపర్వం, అక్కినేని నాగచైతన్యతో లవ్‌స్టోరీ చిత్రాల్లో నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *