పోషకాల నెలవు ఎగ్‌పాలక్‌ ఆమ్లెట్‌

గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు తరుచు చెబుతుంటారు. ప్రతిరోజూ ఆహారంలో ఏదో విధంగా గుడ్డును చేర్చడం వల్ల రోగాల బారి నుంచి తప్పించుకోవచ్చంటారు. అయితే ప్రతిరోజూ ఒకే రకమైన కూర కాకుండా కాస్త వెరైటీగా వండుకోవడానికి మీ కోసం ఈ కొత్తరకం ఆమ్లెట్‌. అటు మంచి రుచితో పాటు చక్కని ఆరోగ్యం కూడా మీ సొంతం. గుడ్డులో మంచి ప్రొటీన్లు ఉండగా పాలకూర ఏ విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండు కలిస్తే పోషకాలు మెండుగా అందుతాయి శరీరానికి. వారానికి మూడు సార్లు తిన్నా శరీరానికి పోషకాలు అందుతాయి.

కావాల్సిన పదార్థాలు : పాలకూర తరుగు – అరకప్పు, గుడ్లు – నాలుగు, ఆలివ్‌ నూనె – రెండు టేబుల్‌ స్పూనులు, మిరియాల పొడి – అరటీస్పూను

తయారుచేసే విధానం : పాలకూర ఆకుల్ని ఉడికించి మెత్తగా చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో గుడ్లు పగులగొట్టి వేయాలి. అందులో కాస్త ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా గిలక్కొట్టాలి. ఇప్పుడు స్టవ్‌ మీద కళాయి పెట్టి పాలకూర తరుగును కాస్త ఫ్రై చేయాలి. అందులోని నీరు పోయి… పచ్చి వాసన కూడా పోయి వేపుడులా తయారవుతుంది. అప్పుడు ఆ కళాయి దించేసి ఆమ్లెట్‌ వేసేందుకు పెనం మీద పెట్టాలి. పెనంమీద కాస్త ఆలివ్‌ ఆయిల్‌ వేయాలి. దానిపై గిలక్కొట్టిన గుడ్ల సొన వేసి పైన వేయించిన పాలకూర అంతటా పరవాలి. రెండువైపులా మంచి కాల్చాలి. అంతే పాలకూర ఆమ్లెట్‌ సిద్ధం. రుచికరమైన పాలకూర ఆమ్లెట్‌ మీ ఫ్యామిలీ ఆరోగ్యానికి చక్కని విందు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *