రైతులు దేశానికి జీవనాడి : యువరాజ్

రైతులు దేశానికి జీవనాడి అని, శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని తాను నమ్ముతున్నానని టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్లో రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు. శనివారం పుట్టినరోజు నాడు రైతుల సమస్య పరిష్కారం కావాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేసిన మాజీ క్రికెటర్ పుట్టినరోజు నాడు అందరూ తమ కోరికలు నెరవేర్చుకుంటారని, అయితే తాను ఈ రోజు తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం కంటే, రైతుల సమస్యలు పరిష్కరించడం ప్రధానమని నమ్ముతున్నానని పేర్కొన్నారు. రైతుల సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలని తాను కోరుకుంటున్నట్లుగా, పుట్టిన రోజు నాడు తన కోరిక నెరవేరా లని ఆశిస్తున్నట్టుగా యువరాజ్ సింగ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. భారత మాజీ క్రికెటర్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు తన మద్దతు పలికారు. అయితే రైతు నిరసనలపై తన తండ్రి యోగ్ రాజ్ సింగ్ చేసిన ప్రసంగం పట్ల తాను బాధ పడ్డారు అని పేర్కొన్నారు. ఆందోళనకు మద్దతుగా క్రీడాకారులు తమ అవార్డులను తిరిగి ఇస్తున్నట్లు తన తండ్రి యోగ్ రాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు ఆయన బాధ పడ్డానని తెలిపారు. సింఘూ సరిహద్దు వద్ద రైతుల ఆందోళనలో చేరిన బాక్సర్ విజయేందర్ సింగ్, కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోకపోతే తన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును తిరిగి ఇస్తానని చెప్పారు. మాజీ జాతీయ బాక్సింగ్ కోచ్ గుర్బక్ష్ సింగ్ సంధు కూడా రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు తన ద్రోణాచార్య అవార్డును తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు. కరోనా వైరస్ పై పోరాడటానికి జాగ్రత్తలు తీసుకోవాలని రైతులను కోరారు. జై జవాన్, జై కిసాన్! జై హింద్ అంటూ ముగించారు.