అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని

మనసా వాచా కర్మనా, త్రికరణశుద్ధిగా అమరావతి రాజధానిగా ఉండాలని తాము విశ్వసిస్తున్నామని, ఆఖరి రైతుకు న్యాయం జరిగే వరకూ బీజేపీ పోరాటం చేస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి వామరాజు సత్యమూర్తి సత్యమూర్తి హామీ ఇచ్చారు. అమరావతి రాజధాని ఉద్యమానికి ఏడాది పూర్తైన సందర్భంగా ‘అమరావతి జేఏసీ’ ఆధ్వర్యంలో ‘జనభేరీ” నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ ప్రతినిధిగా సత్యమూర్తి హాజరయ్యారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు ? అని ప్రశ్నించారు. పాదయాత్ర చేస్తూ రోడ్డుమీద ఉన్నారనీ, ప్రజలు ఇళ్లలో ఉన్నారనీ, ఈ రోజు ఆయన్ను గెలిపించిన తర్వాత ఆయన ప్రజల్ని రోడ్డుమీద పడేశారని మండిపడ్డారు. ఆయన హాయిగా ఏసీ గదుల్లో ఉన్నారనీ, ఇలా ప్రజలను రోడ్డుమీద పడేసిన జగన్కు గుణపాఠం నేర్పాల్సిందేనని ఆయన వ్యాఖ్యనించారు.