కోవాగ్జిన్ పని తీరు భేష్

కోవాగ్జిన్ పేరుతో హైదరాబాద్ కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్‌పై ప్రస్తుతం మూడో దశ క్లినికల్ పరీక్షలు జరుగుతున్నాయి. కోవిడ్-19 కట్టడికి దేశీయంగా అభివద్ధి చేస్తున్న వ్యాక్సిన్ తొలి దశలో అత్యుత్తమ ఫలితాలు ఇచ్చినట్లు భారత్ బయోటెక్ తాజాగా వెల్లడించింది. వ్యాక్సిన్ భద్రత, ప్రభావం వంటి అంశాలపై మరింత విస్తతంగా నిర్వహించనున్న మూడో దశ పరీక్షల ద్వారా మాత్రమే తగిన డేటా లభించగలదని వివరించింది. తొలి దశ క్లినికల్ పరీక్షలలో కోవాగ్జిన్ ఎలాంటి ఇతర సమస్యలకూ తావివ్వలేదని కంపెనీ స్పష్టం చేసింది. వెరసి తొలి, రెండు దశల క్లినికల్ పరీక్షల డేటా ఆధారంగా కంపెనీ మార్కెటింగ్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఇది మధ్యంతర నివేదిక మాత్రమేనని భారత్ బయోటెక్ పేర్కొంది.