ఎగ్ స్వీట్‌కార్న్ సూప్

కావలసిన పదార్థములు : గ్రుడ్లు- 2, స్వీట్ కార్న్ – 2 టీ స్పూన్లు, పంచదార – 1/2 టీ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు, టేస్టింగ్ పౌడర్ – 1/2 టీ స్పూను, పెప్పర్ పౌడర్ – 1/2 టీ స్పూను, ఉప్పు – తగినంత
తయారు చేయు విధానం ; 4 కప్పుల నీటిని మరిగించి దానిలసో స్వీణ కార్న్ వేయాలి. తర్వాత దానిలో టేస్టింగ్ పౌడరు, పెప్పర్ పౌడరు, ఉప్పు వేయాలి. అవి కొంచెం మరిగిన తర్వాత కొద్ది నీళ్లలో కార్న్‌ఫ్లోర్‌ని కలిపి, దాన్ని కూడా మరుగుతున్న నీటిలో వేయాలి. ఆ తర్వాత గ్రుడ్లను పగుల గొట్టి సొనను బాగా కలిపి, ఆ సొనను కూడా దినిలో వేసి, బాగా మరిగిన తర్వాత కొంచెం పంచదార కలిపి వేడివేడిగా వడ్డించాలి.