పింక్‌బాల్ టెస్టులో టీమిండియా ఘోరం ఓటమి

ఆస్ట్రేలియాతో ఆడిలైడ్‌లో జరుగుతున్న రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన టీమిండియా టెస్టుల్లో అత్యల్ప స్కోరు నమోదు చేయడంతో పాటు మరో చెత్త రికార్డును నమోదు చేసింది. ఆసీస్ పేసర్ల దాటికి భారత బ్యాట్స్‌మన్ అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా విధించిన 90 పరుగులు టార్గెట్‌ను ఆతిథ్య జట్టు రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. జో బర్స్న్ అర్థసెంచరీతో మెరవగా.. వేడ్ 33, లబుషేన్ 6 పరుగులు చేశారు. కాగా అంతకముందు క్రితం రోజు స్కోరు 9/1తో బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ 9 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఒక ఇన్నింగ్స్‌లో ఒక్క ఆటగాడు కూడా డబుల్ డిజిట్ దాటకపోవడం 96 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే కావడం విశేషం. 1924లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 30 పరుగులకే ఆలౌటైంది. అప్పటి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో హెర్బీ టేలర్ 7 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం.. మిగతా ఆటగాళ్లు కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.