రోల్డ్‌ ఆమ్లెట్‌ తయారీ

 

కావలసిన పదార్ధాలు: గుడ్లు – 2, బ్రెడ్‌ ముక్కలు – 2, బీన్స్‌ ముక్కలు – 1 టేబుల్‌ స్పూను, ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్‌ స్పూన్లు, పచ్చి మిరపకాయలు- 2, మిరియాల పొడి – అర టీస్పూను, పసుపు – చిటికెడు,  ఉప్పు -తగినంత, నూనె – సరిపడా.

తయారుచేయు విధానం: ముందుగా గుడ్డు సొనని మిక్సీలో వేసుకోవాలి. ఒక గిన్నెలో సన్నగా తరిగిన బీన్స్‌ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు,స బ్రెడ్‌ పొడి, పచ్చి మిరపకాయ ముక్కలు, మిరయాల పొడి, పసుపు, ఉప్పు, మిక్సీలో వేసిన గుడ్డు సొన వేసి బాగా కలపాలి. స్టవ్‌ మీద పెనం పెట్టి సరిపడా నూనె పోసి పలచగా ఆమ్లెట్‌ వేయాలి. ఆమ్లెట్‌ వేగాక గుండ్రంగా మడవాలి. దీన్ని టమోటా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *