సంక్రాంతి రోజు సూపర్‌స్టార్ పార్టీ ప్రకటన

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ తన పార్టీ ప్రకటనకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. జనవరి 14న సంక్రాంతి రోజు రాజకీయ ప్రకటన చేస్తారని తెలు స్తోంది. తమిళులకు సంక్రాంతి అంటే పెద్ద పండుగ. ఆరోజు పార్టీ ప్రకటన చేస్తే పొంగల్ సెంటిమెంట్ కలిసి వస్తుందని రజినీకాంత్ వర్గం భావిస్తోంది. ఇక జనవరి 17 ఎంజీఆర్ పుట్టినరోజున పార్టీకి సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉంది. పార్టీ ప్రకటన అనంతరం డీఎంకే అధినేత మాజీ సీఎం కరుణానిధి సమాధిని రజినీ కాంత్ సందర్శించనున్నారు. రజినీకాంత్ పార్టీ పేరుపై గుర్తుపై ఆసక్తి నెలకొంది.. రజినీ కాంత్ పార్టీ పేరు మక్కల్ సేవై కర్చి అని ప్రచారం జరుగుతున్నది.. ఇక రజినీకాంత్ పార్టీకి ఆటో గుర్తు కేటాయించారని కూడా ప్రచారం సాగుతోంది.. మక్కల్ సేవై కర్చి అంటే ప్రజాసేవ పార్టీ అని అర్ధం… దీనిపై సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెడుతున్నారు.. అయితే దీనిపై రజనీకాంత్ సామాజిక సేవా విభాగం రజనీ మక్కళ్ మండ్రం వివరణ ఇచ్చింది. కొత్త పార్టీ పేరుపై అధికారిక ప్రకటన వచ్చే దాకా ఓపిక పట్టాలని సూచించింది. రజినీకాంత్ పార్టీ ప్రకటనపై తమిళనాట ఆసక్తి రేపుతోంది. తమిళ రాజకీయాల్లో రజినీకాంత్ ఎంట్రీ అనగానే ఆయన పార్టీ పేరు గుర్తు ఏంటి? ఎప్పుడు అక్కడి రాజకీయాలను షేక్ చేస్తోంది.