మోడీకి అవార్డు వెనుక…

ఇప్పటివరకూ నరేంద్ర మోదీకి పలు దేశాలు అత్యున్నత పురస్కారాలను అందజేశాయి. సౌదీ అరేబియా-అబ్దులజీజ్ అల్ సౌదీ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్ గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనియన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-ఆర్డర్ ఆఫ్ జయేద్ అవార్డ్ రష్యా-ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ మాల్దీవులు-రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్ పురస్కారాలు అందించాయి. తాజాగా నరేంద్రమోడీకి అమెరికా ప్రతిష్టాత్మక ‘లీజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు’ ప్రకటించింది. అమెరికా – భారత్ మధ్య ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలు బలపడినందుకు ఈ అవార్డును లీజియన్ ఆఫ్ మెరిట్ అమెరికా మిల టరీ విభాగంలో ఓ అత్యుత్తమ అవార్డు. మెరుగైన పరిపాలన అందించిన అమెరికా రాష్ట్రాధినేతలకు ఈ అవార్డు ఇస్తుంటారు. గతంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ జపాన్ మాజీ ప్రధాని షింజో అబేలకు ఈ అవార్డు ఇచ్చారు. అటువంటి ప్రతిష్టాత్మక అవార్డు మోదీకి దక్కింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతోనే ఈ అవార్డుకు మోదీని ఎంపికచేశారు. వీళ్లిద్దరి మధ్య ఉన్న కొంత కాలంగా ఎంతో స్నేహం చిగురించింది. మరికొద్ది రోజుల్లోనే ట్రంప్ అధ్యక్షపదవికి రాజీనామా చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ తన చిరకాల మిత్రుడు భారతప్రధాని నరేంద్రమోదీకి ఓ అరుదైన బహుమానాన్ని ఇచ్చాడు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్- అమెరికా సంబంధాలు ఎంతో బలపడ్డాయి. అమెరికాలోని భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధూ.. మోదీ తరఫున ఈ అవార్డును స్వీకరించారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియాన్ దీన్ని ఆయనకు అందజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయిన మోదీకి తన చేతులమీదుగా అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని రాబర్ట్ పేర్కొన్నారు.