అక్కడ ఎవరూ ఆసీస్‌ను ఓడించలేరు.

 

డే/నైట్‌ టెస్ట్‌ ఈ పరాజయం నుంచి భారత్‌ కోలుకోగలదని నేను అనుకోనని ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్‌ బ్రాడ్‌ హడిన్‌ తెలిపాడు. ‘మిగిలిన మూడు టెస్టుల్లో ఒకటి బ్రిస్బేన్‌లో జరగాల్సివుంది. అక్కడ ఎవరూ ఆసీస్‌ను ఓడించలేరు. వచ్చే రెండు టెస్టుల్లో పిచ్‌ భారత క్రికెట్‌కు సరిపోతుంది. కానీ ఆ జట్టు పుంజుకోవడం కష్టం. కిందటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు భారత్‌కు గొప్ప బౌలింగ్‌ దళం ఉంది. ఇప్పుడు సీనియర్‌ ఇషాంత్‌ శర్మ లేడు. మొహ్మద్‌ షమీ గాయంతో దూరమయ్యాడు. షమీ స్థానాన్ని భర్తీ చేసే బౌలింగ్‌ వనరులు భారత్‌కు లేవు. సిరీస్‌లో భారత్‌కు మ్యాచ్‌ గెలవడానికి ఉన్న ఏకైక అవకాశం అడిలైడ్‌లో తొలి టెస్టు. అక్కడికి పరిస్థితులు భారత బౌలర్లకు సహ కరించాయి. పరుగులు కూడా బాగానే చేశారని అనుకున్నా. సిరీస్‌లో భారత్‌ ఇక పుంజుకుంటుందని అనుకోను’ అని బ్రాడ్‌ హడిన్‌ అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *