చిత్త శుద్ధి లేకుండా చట్టాలు చేస్తే ఏo ప్రయోజనం

 

చిత్త శుద్ధి లేకుండా చట్టాలు చేస్తే ఏ మాత్రం ప్రయోజనం అని జనసేన అధ్యకుక్షుడు పవప్‌కల్యాన్‌ విమర్శించారు. ధర్మవరంలో స్నేహలత అనే దళిత యువతి దారుణ హత్యకు గురైన ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. ‘పేద కుటుంబానికి చెందిన స్నేహలత అనే యువతి.. వేధింపులు భరించలేక చదువు మధ్యలోనే మానేసి ఉద్యోగంలో చేరిందని తెలిసింది. మా బిడ్డను వేధిస్తున్నారు.. మా ఇంటి ముందుకొచ్చి భయపెడుతున్నారని పోలీసు స్టేషన్‌కు వెళ్తే అధికారుల ప్రవర్తన ఆ తల్లిదండ్రులను మరింత కుంగదీసింది. అక్కడి నుంచి ఇల్లు మారిపోండి అని సలహా ఇచ్చారు’ అంటూ పవన్‌ కళ్యాణ్‌ మండిపడ్డారు. వ్యవస్థ వైఫల్యం వల్లే స్నేహలత హత్యకు గురైందని జనసేనాని ఆరోపించారు. ప్రత్యక్ష ఉదాహరణ దిశా చట్టమేనని పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. దిశ చట్టం చేయగానే పాలాభిషేకాలు చేయించుకొని.. కేకులు కోయించుకున్నారని.. చట్టాన్ని మాత్రం ఆచరణలోకి తీసుకురాలేదన్నారు. ప్రచారం కోసం చేసిన ఈ చట్టం ఆడబిడ్డలకు ఎలా రక్షణ ఇస్తుందో సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని పవన్‌ డిమాండ్‌ చేశారు.చిత్త శుద్ధి లేకుండా చట్టాలు చేస్తే ఏ మాత్రం ప్రయోజనం ఉండదని చెప్పడానికి దిశ చట్టం ఉదాహరణ అన్నారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేశామని.. నేరం చేసిన వారికి 21 రోజుల్లోనే శిక్ష పడుతుందని జగన్‌ సర్కారు ప్రచారం చేసిందని.. కానీ ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. మైనర్‌ బాలికలు, విద్యార్థినులు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలు ఆగలేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *