అతడితోనే అలియా పెళ్లి

బాలీవుడ్ హీరోయిన్లు, కత్రినా, దీపికా పదుకోన్‌తో బ్రేకప్ తరువాత అలియాతో ప్రేమలో పడ్డాడు బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌కపూర్. పలు ప్రేమాయాణాలు నడిపిన ఈ బాలీవుడ్ హీరో రణ్‌బీర్ తన ప్రేమికురాలు అలియా భట్ అని తేల్చి చెప్పేశాడు. త్వరలోనే తమ పెళ్లి జరగనుందంటూ ఫ్యాన్స్‌కు తీపి కబురందించాడు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా తమ వివాహం వాయిదా పడిందని, లేదంటే ఈ పాటికే పెళ్లి జరిగి ఉండేదని రణ్‌బీర్ వ్యాఖ్యానించారు. దీనిపై ఇంతకంటే ఇప్పుడేమీ చెప్పలేను, కానీ త్వరలోనే పెళ్లి చేసుకుందా మనుకుంటున్నామని తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో రణబీర్ తమ పెళ్లి కబురును తాజాగా ధవీకరించారు. కాగా వీరి పెళ్లి గత కొన్ని నెలలుగా పుకార్లు నిషికార్లు చేస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు రణబీర్ స్పష్టం చేశాడు తమ పెళ్లి విషయం.
.