బీసీసీఐపై మండిపడ్డ లెజెండ్ క్రికెటర్

బీసీసీఐ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా మండిపడ్డారు. యువ బౌలర్ టీ నటరాజన్ భార్య పాపకు జన్మనిచ్చినా.. అతడికి ఎందుకు సెలవులు ఇవ్వలేదంటూ గవాస్కర్ పేర్కొన్నారు. ఒకే టీమ్‌లో ఉన్న కోహ్లీ నటరాజన్‌ని వేర్వేరుగా చూడటం టీమిండియా మేనేజ్మెంట్కు చెల్లిందని సునీల్ గవాస్కర్ సెటైర్లు వేశారు. గతంలో స్పిన్నర్ ఆర్ అశ్విన్ ఒక్క మ్యాచ్‌లో రాణించకపోయినా పక్కన పెట్టారని.. అదే బ్యాట్స్‌మెన్ విషయంలో అలా చేశారా అని సన్నీ ప్రశ్నించారు. సన్రౖైెజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి.. ప్రస్తుతం టీంఇండియాకు ఎంపికైన నటరాజన్ భార్య కూడా నటరాజన్ ఐపీఎల్లో ఆడుతున్నప్పుడే ప్రసవించింది. అతడికి అమ్మాయి పుట్టింది. అయితే ఆ టైంలో నటరాజన్‌కు బీసీసీఐ సెలవు మంజూరు చేయలేదు. మరోవైపు అతడిని యూఏఈ నుంచి ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేసి.. ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కించారు. అయితే ఇప్పటివరకు నటరాజన్ తన పాపను చూసుకోలేదు. ఈ క్రమంలో గవాస్కర్ బీసీసీఐపై మండిపడ్డారు. బీసీసీఐ నటరాజన్‌కు ఓన్యాయం.. విరాట్ కోహ్లీకి మరో న్యాయం చేసిందని ఆయన ఫైర్ అయ్యారు.