ఒక్క రూపాయికే భోజనం

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ తూర్పు దిల్లీ ఎంపీ గౌతం గంభీర్ ఒక్క రూపాయికే నిరుపేదలకు భోజనం అందిచే పథకానికి శ్రీకారం చుట్టారు. తన పార్లమెంటు పరిధిలోని గాంధీ నగర్లో గురువారం తొలి క్యాంటీన్ ను ప్రారంభించారు. కులం మతం లేదా ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన ఆహారం తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నదని భావిస్తున్నాను. నిరాశ్రయులకు రోజుకు రెండు పూటలా భోజనం లభించకపోవడం బాధగా ఉంది. దీన్ని దష్టిలో ఉంచుకుని జన్ రసోయి క్యాంటీన్లకు ప్రాణం పోస్తున్నాం అని గంభీర్ చెప్పారు. ఢిల్లీలోని వస్త్ర మార్కెట్ అయిన గాంధీనగర్‌లో జన్ రసోయిని పూర్తి ఆధునిక క్యాంటీన్‌గా రూపొందించారు. కేవలం రూపాయికే భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భోజనంలోకి బియ్యం కాయధాన్యాలు కూరగాయలు ఉండనున్నాయి. ఈ క్యాంటీన్లలో ఒకేసారి వంద మంది కూర్చునే సామర్ధ్యం కలిగివుండనున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా 50 మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టుకు గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ తోపాటు ఎంపీ వ్యక్తిగత వనరుల నుంచి నిధులు సమకూరుస్తున్నారు. తర్వాత గణతంత్ర దినోత్సవం రోజున అశోక్ నగర్లోనూ మరో క్యాంటీన్‌ను తెరువనున్నారు.