బీజేపీలోకి వైఎస్‌ మిత్రుడు

 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో సాయిప్రతాప్‌ కడప జిల్లాలో కీలకంగా వ్యవహరించారు. వైఎస్‌, సాయి ఇద్దరూ ప్రాణ స్నేహితులు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. జిల్లాలో కీలకంగా వ్యవహరిండంతో ఆయనకు 2019లో రాజంపేట ఎంపీ టికెట్‌ కూడా ఇస్తారని ప్రచారం జరిగింది. చివరికి ఆ టికెట్‌ సీనియర్‌ నేతను వరించింది.. అప్పటి నుంచి రాజకీయ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉన్నారు. ఇప్పటికే పలువురు టీడీపీకి నేతలు వైఎస్సార్‌సీపీతో పాటూ బీజేపీలో చేరుతున్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్‌ బీజేపీలో చేరేందుకు ముహూర్తం కుదర్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయన అల్లుడు లోకేష్‌ కుమార్‌ బీజేపీలో చేరనుండగా.. సాయి ప్రతాప్‌ కూడా కాషాయం కండువా కప్పుకోనున్నారు. సునీల్‌ ధియోదర్‌, సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌ రెడ్డి సమక్షంలో సాయిప్రతాప్‌, అతని కుటుంబ సభ్యులు బీజేపీలో చేరనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *