సీఎం కుర్చికి అంకితం కాలేదు

 

బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తుందని జనాలు మాట్లాడుకుంటున్నారనీ, సీఎం కుర్చికి తను అంకితం కాలేదని పేర్కొన్నారు బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌. ఇప్పటికే జేడీయూ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న ఆయన తన స్థానంలో పార్టీ సీనియర్‌ నేత, రాష్ట్ర మాజీ ఉన్నతాధికారి ఆర్‌సీపీ సింగ్‌కు జేడీయూ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన గంటల వ్యవధిలోనే నితీష్‌ కుమార్‌ మరో బాంబు పేల్చారు. జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో నితీష్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించలేనని సంకీర్ణానికి తెలియ జేశాను. కానీ వారు అంగీకరించలేదు. ఎంతో ఒత్తిడి తర్వాత నేను మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. ఈ పదవి పట్ల నాకు ఏ మాత్రం ఆసక్తి లేదు.. అక్కర్లేదు’ అని స్పష్టం చేశారు. ఇక నితీష్‌ వ్యాఖ్యలు ఎన్‌డీఏ కూటమిలో కలకలం రేపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *