సంక్రాంతి కానుకగా ‘రెడ్‌’ విడుదల

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత రామ్‌ చేసిన సినిమా రెడ్‌. తిరుమల కిశోర్‌ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవి కిషోర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమతా అయ్యర్‌ ఇందులో కథానాయికలు. ఈ చిత్రంలో రామ్‌,హెబ్బా పటేల్‌ పై చిత్రీకరించిన స్పెషల్‌ మాస్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను చిత్ర బందం సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. నత్య దర్శకుడు జానీ మాస్టర్‌ మాట్లాడుతూ, ‘మార్చి నెలలో లాక్‌ డౌన్‌కు ముందుచేసిన పాట ఇది. చాలా ఎనర్జిటిక్‌ సాంగ్‌ ఇది. ఈ పాట విషయంలో హీరో రామ్‌కి స్పెషల్‌ థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. ఈ పాట బాగా రావడానికి ఆయన ఇచ్చిన ఇన్‌పుట్స్‌ బాగా ఉపకరించాయి. పాట అద్భుతంగా వచ్చింది. రామ్‌ తన స్టెప్స్‌తో ఇరగ దీశారు. హెబ్బా పటేల్‌కి ఇదే ఫస్ట్‌ టైమ్‌ స్పెషల్‌ సాంగ్‌ చేయడం. తను కూడా చాలా బాగా చేసింది. ఈ పాట బాగా రావడానికి బడ్జెట్‌ పరంగా రవి కిషోర్‌ ఫుల్‌ ఫ్రీడం ఇచ్చారు. మణి శర్మ ఎనర్జిటిక్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. ముఖ్యంగా బీజియమ్స్‌ అదిరిపోయాయి. థియేటర్స్‌ ఈ పాట ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుంది’ అని చెప్పారు. ఈ సందర్భంగా నిర్మాత ‘స్రవంతి’రవి కిషోర్‌ మాట్లాడుతూ, ‘సినిమాలో వచ్చే ఫస్ట్‌ సాంగ్‌ ఇది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో స్పెషల్‌గా సెట్‌ వేసి 6 రోజులు భారీ నిర్మాణ వ్యయంతో ఈ పాటని చిత్రీకరించాం. ‘ఏరు డించక్‌ డించక్‌ డింక’ అంటూ కాసర్ల శ్యామ్‌ రాయగా, సాకేత్‌, కీర్తనా శర్మ ఆలపించిన ఈ పాటకు జానీ మాస్టర్‌ నత్య దర్శకత్వం చేశారు. దీంతో పాటు ఈ సినిమాలో పాటలన్నీ చాలా బాగుంటాయి’ అని తెలిపారు. ఈనెల 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *